Breaking News

రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

Published on Fri, 08/23/2024 - 16:41

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ సీనియర్‌ నాయ‌కులు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం క‌లిశారు. డీజీపీ కార్యాల‌యంలో తుంగ‌తుర్తి రైతుల‌పై, గురువారం సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిప‌ల్లిలో ఇద్దరు మహిళా జ‌ర్న‌లిస్టుల‌పై జ‌రిగిన దాడులపై డీజీపీకి  కేటీఆర్ ఫిర్యాదు చేశారు. దాడుల‌కు పాల్ప‌డ్డ వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ నేత‌లు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపైనా  డీజేపీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారని నేతలు ఆరోపించారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరంపైన దాడి చేయడం టెంట్ పీకి వేయడం వంటి కార్యక్రమాల పైన అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్నారని డీజేపీకి తెలియజేశారు. రాజకీయ ప్రమేయం జోక్యం వలన ప్రతిపక్ష నాయకులపైన పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, హింసిస్తున్నారని తెలిపారు. కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పోలీస్ అధికారులు పాల్గొనడం గుర్తుచేశారు.

అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. దీనిపై శాంతియుతంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. తిరుమలగిరిలో తమ నాయకుడు కిశోర్‌ ధర్నా చేస్తే.. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్‌ కమూకలు దాడి చేశాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో హింస సరికాదని హితవు పలికారు. పోలీసుల సమక్షంలో కిరాయి మూకలు దాడి చేశాయని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నారని అన్నారు. 

‘పోలీసులు మంత్రుల బర్త్ డేకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైడ్రా పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతల ఫార్మ్ హౌస్‌లను కూల్చాల్సిందే. మంత్రి పొంగులేటికి  అంత శ్రమ అవసరం లేదు. శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి. మీ ఫార్మ్ హౌస్ కూల్చాలో లేదో రంగనాధ్ డిసైడ్ చేస్తారు. రేపు మహిళా కమీషన్ ముందు హాజరవుతా.

నిన్న ప్రజాస్వామ్యబద్దంగా బిఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో రైతులు ధర్నా చేస్తుంటే 50 మంది కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. స్థానిక పోలీసు యంత్రాంగంతో కుమ్మక్కు అయ్యి దాడి చేశారు. సుతిల్ బాంబులు వేసి దాడులకు పాల్పడ్డారు. దాడులకు పోలీసులు మద్దతు తెలపడం అంటే రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనకు పరాకాష్ట. 

రుణమాఫీపై రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం..
రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి స్వంత గ్రామంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ వాళ్లు దాడులు చేశారు. కొండారెడ్డిపల్లి నుండి కల్వకుర్తి వరకు మహిళా జర్నలిస్టులను వాళ్ళను వెంబడించారు.  సీఎం రేవంత్ రెడ్డిని ఏమీ అన్నారని వాళ్లపై దాడులు చేశారు. రేవంత్ రెడ్డి సిగ్గుంటే ఏ ఊరుకు వస్తావో చెప్పు. నేను వస్తా. రుణమాఫీ ఏ ఊరులో సంపూర్ణంగా జరిగిందో రేవంత్ రెడ్డి చెప్పాలి. సీఎంకు పరిపాలించే సత్తా లేదు.  ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)