Breaking News

నాడు కేసీఆర్‌ను కాపాడింది మీరే

Published on Thu, 11/30/2023 - 02:49

సాక్షి, హైదరాబాద్‌: దీక్షాదివస్‌ సందర్భంగా తెలంగాణ సాధన కోసం 2009లో కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్య సేవలు అందించిన నిమ్స్‌ వైద్య బృందాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యుల బృందం నాటి సంఘటనలు, అప్పటి భావోద్వేగాలను నెమరు వేసుకున్నారు.

11 రోజులపాటు కేసీఆర్‌ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందామని ఆయన ప్రాణానికి ముప్పు కలుగుతుందన్న భయాందోళన తమను వెంటాడేదన్నారు. ఒకవైపు సీఎం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మరో వైపు అప్పటి ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన అనేక రకాల ఒత్తిడిలను తట్టుకోవడం తమకు ఒక సవాలుగా ఉండేదని గుర్తు చేసుకున్నారు.

కేసీఆర్‌ ఏడు రోజుల తర్వాత కూడా తమ నిరాహార దీక్షను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయం కలిగిందన్నారు. అయితే ఆయన శారీరకంగా పూర్తిస్థాయిలో బలహీనంగా మారినా, ఆరోజు తన దీక్ష కొనసాగించే ముందు మానసికంగా అత్యంత దృఢంగా ఉండడంతోనే అన్ని రోజులు దీక్ష కొనసాగించగలిగారని ఆ నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చారు.  

మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది 
కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా నిమ్స్‌ వైద్య బృందం అందించిన సేవలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేటీ రామారావు భావోద్వేగంతో అన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కాపాడుకుంటూనే మరోవైపు కుటుంబ సభ్యులుగా కేసీఆర్‌ ఆరోగ్యం పట్ల తమకు ఆందోళన ఉండేదన్నారు. ఆయన పట్టుదల, మొండితనం వల్లనే నిరాహార దీక్షను కొనసాగించగలిగారని చెప్పారు.

అయితే ఒక కుటుంబ సభ్యుడిగా అనేక సందర్భాల్లో ఆందోళనకు గురైనప్పుడు నిమ్స్‌ వైద్య బృందం అందించిన మనోధైర్యం ఎప్పటికీ మరువలేమన్నారు. అత్యంత సంక్లిష్టమైన సంక్షోభ సమయంలో తమ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సజీవంగా నిలిపి స్వరాష్ట్రాన్ని సాకారం చేసేందుకు సహకరించిన వైద్య బృందానికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపి వారిని సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు