సోషల్‌ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీశ్‌

Published on Tue, 09/03/2024 - 02:11

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రతిపక్షాలు ప్రజాప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పనికిమాలినవని.. వాళ్లు చేసిన పాపాలపై నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు రాజకీయంగా బతికేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అనుకోని విధంగా వచి్చన ఈ విపత్తును ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఖమ్మంలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.

వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులరి్పంచాక డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలకు పని లేదని.. వారు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్‌ఎస్‌ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని, ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగిపోయాయని, కానీ ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్‌ నేడు సురక్షితంగా ఉందంటే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమేనని భట్టి తెలిపారు. భారీ వర్షాలు, వరదతో నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)