Breaking News

ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం.. కేసీఆర్‌కు కోమటిరెడ్డి లేఖ

Published on Wed, 07/19/2023 - 08:58

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌పై కాంగ్రెస్‌ పొలిటికల్‌ వార్‌కు దిగుతోంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని లేదంటే కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆయన మంగళవారం లేఖ రాశారు. 

2020లో అసెంబ్లీ సాక్షిగా టీచర్‌ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటన చేసినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని మండిప డ్డారు. రూ.లక్షలు పెట్టి కోచింగ్‌ తీసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల్లేక వయోపరి మితి దాటిపోతూ లక్షలాదిమంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరాయో చెప్పాలని నిలదీశారు. 

అమరవీరుల త్యాగ ఫలితం ఇదేనా? సకల జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇందుకేనా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో ఆరు నెలలకు ఒకసారి టెట్, రెండేళ్లకు ఓసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేవారని గుర్తు చేశారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృథాచేశారని ఆరోపించారు.  

ఇది కూడా చదవండి: ఇక ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులు

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)