Breaking News

కాంగ్రెస్‌ గెలిస్తే.. 4కోట్ల మంది విజయం

Published on Thu, 09/14/2023 - 02:23

నల్లగొండ రూరల్‌/హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో 4కోట్ల మంది ప్రజలు గెలిచినట్లని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం నల్లగొండలో నియోజకవర్గ బూత్‌ ఇన్‌చార్జిలు, ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమావేశానంతరం వెంకట్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. 76 నుంచి 80 సీట్లలో విజయం సాధించి మరో 90 రోజుల్లో అధికారంలోకి రాబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.

నల్లగొండ జిల్లాలో కొత్తగా ఎవరినీ కాంగ్రెస్‌లో చేర్చుకోవడం లేదని, ఉన్న వారికే సీట్లు లేవని స్పష్టం చేశారు. వచ్చే నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామన్నారు. దళిత బంధుపై హైకోర్టులో పిటిషన్‌ వేశామని, గురువారం రిజిస్టర్‌ అవుతుందని తెలిపారు. హైదరాబాద్‌ శివారులోని తుక్కుగూడలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు. తాను నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కోమటిరెడ్డి చెప్పారు.  

ఒకటో తేదీనే జీతాలిస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండే ఈ కొద్దినెలలైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వాలని కోరుతూ ఆయన బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)