Breaking News

బీఆర్‌ఎస్, బీజేపీకి ఓటేస్తే మూసీలో వేసినట్లే

Published on Thu, 05/02/2024 - 04:43

నల్లగొండ: బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓట్లేస్తే మూసీ నదిలో వేసినట్లేనని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ ఒక్కటే అని, ఆ పార్టీలను నమ్మవద్దని ప్రజ లను కోరారు. ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని.. అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌ అన్నట్లుగా మీ ముందుకు రాబోమని చెప్పారు. 

హరీశ్‌రావు దొంగ రాజీనామా లతో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. ఈసారి రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. బీజేపీ నల్లగొండ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా దక్కదన్నారు. సర్పంచ్‌గా కూడా గెలువలేని వ్యక్తిని బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పెట్టిందని ఎద్దేవా చేశారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తరహాలో నల్లగొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మండలంలో వలంటీర్లను నియమిస్తా మని కోమటిరెడ్డి వెల్లడించారు. 

ఆయా గ్రామాల్లోని వలంటీర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ప్రభుత్వ పథ కాలు అర్హులకు అందేలా చూస్తారని, ఎన్నికల తర్వాత దీనిని అమలు చేస్తామన్నారు. గుమ్మల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి, కాంగ్రెస్‌ నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)