Breaking News

విపక్షాల సభకు పవార్ వస్తారా? రారా? ఇదీ క్లారిటీ..

Published on Mon, 07/17/2023 - 14:48

బెంగళూరు: బెంగళూరు వేదికగా నేటి నుంచి ప్రారంభమైన ప్రతిపక్షాల సమావేశానికి ఎస్పీపీ అధినేత శరద్‌ పవార్ గైర్హాజరు కానున్నాడని ఊహాగానాలు వచ్చిన వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. శరద్‌ పవార్ రేపు(మంగళవారం) మీటింగ్‌కు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. శరద్‌ పవార్‌తో స్వయంగా తానే ఫోన్‌లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో తెలియజేశారు. 

ప్రతిపక్షాల సమావేశానికి శరద్ పవార్ హాజరు కాట్లేదనే పుకార్లను కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఖండించారు. ప్రతిపక్షాల సమావేశం అధికారికంగా మంగళవారం(జులై 18)నే జరగనుందని తెలిపారు. జులై 17 (సోమవారం) కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆతిథ్యమిస్తున్న డిన్నర్‌కు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. 

'మహారాష్ట్ర అసెంబ‍్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమవనున్న నేపథ్యంలో శరద్ పవార్ తప్పనిసరిగా ఉండాల్సిన అవరసరం ఏర్పడింది. రేపు తప్పకుండా ప్రతిపక్షాల సమావేశానికి హజరవుతారు. భేటీకి రావాల్సిందిగా శరద్‌ పవార్‌ను కోరాను' అని ఖర్గే తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు.. శరద్ పవార్ తప్పకుండా హాజరవుతారని స్పష్టం చేశారు. 

ప్రతిపక్షాల భేటీలో ఎలాంటి సమస్యలు లేవని ఖర్గే వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు తప్పకుండా హజరవుతారని ఖర్దే తెలిపారు. పాట్నా భేటీలో హాజరైన నేతల కంటే ఎక్కువ మంది నేతలు బెంగళూరు సమావేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష‍్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్‌ మనిమమ్‌ ప్రోగ్రామ్‌తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు.

ఇదీ చదవండి:  ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యను: శరద్‌ పవార్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)