Breaking News

అతిపెద్ద అధికార ప్రతినిధి ధన్‌ఖడ్‌!

Published on Wed, 12/11/2024 - 16:19

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఎగువ సభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్‌ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ పూర్తి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి అతిపెద్ద అధికారి ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి. ధన్‌ఖడ్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం నోటీసును మంగళవారం రాజ్యసభలో విపక్ష సభ్యులు అందజేయడం తెల్సిందే. దీనిపై బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే తోటి విపక్షాల ‘ఇండియా’ కూటమి ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

 ‘‘ ధన్‌ఖడ్‌ ఒక ప్రభుత్వ అధికారి ప్రతినిధిలా ప్రవర్తిస్తున్నారు. సీనియర్‌ పార్లమెంటేరియన్లకూ పాఠశాల ప్రధానోధ్యాయునిలా ధన్‌ఖడ్‌ క్లాసులు పీకుతున్నారు. సభలో విపక్ష సభ్యులకు మాట్లాడే స్వేచ్ఛనివ్వట్లేదు. సభ సజావుగా సాగకుండా అడ్డు తగిలే అతిపెద్ద అవరోధం ధన్‌ఖడ్‌.  ఆయన చూపే వివక్ష చూసి విసుగెత్తిపోయాం. ఆయన వైఖరి, ధోరణి సైతం విపక్షాలకు అనుకూలంగా లేదు. అందుకే ఆయనను తొలగించాలని నోటీస్‌ ఇచ్చాం. 

రాజ్యసభ నియమ నిబంధనావళిని తుంగలో తొక్కి రాజకీయాలు ముందంజలోకి వచ్చాయి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ ధన్‌ఖడ్‌ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత మరేదో పదోన్నతి వస్తుందన్న ఆశతో పనిచేస్తున్న అతిపెద్ద అధికార ప్రతినిధిలా ఆయన వాలకం ఉంది. ఆయన తన వైఖరితో రాజ్యసభకు ఉన్న ప్రతిష్టను, పరువును దెబ్బతీస్తున్నారు. మాకు ఆయనపై ఎలాంటి వ్యక్తిగత కక్ష, కోపాలు లేవు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మేం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు పట్టుబడుతున్నాం’’ అని ఖర్గే అన్నారు.   

ప్రజాస్వామ్యంపై దాడి: డీఎంకే
‘‘ ఛైర్మన్‌ ద్వారా బీజేపీ ప్రదర్శిస్తున్న ఈ వైఖరి స్పష్టంగా ప్రజాస్వామ్యంపై దాడే’’ అని డీఎంకే నేత తిరుచ్చి శివ వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యసభలో విపక్ష సభ్యుల గొంతుక వినిపించే అవకాశం చిక్కట్లేదు’’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత నదీముల్‌ హక్‌ అన్నారు. ‘‘ చైర్మన్‌ రాజ్యసభను నడుపుతున్నట్లు లేదు ఒక సర్కస్‌ను నడుపుతున్నట్లు ఉంది. ఉన్న సమయమంతా ఆయన తన సొంత విషయాలు మాట్లాడటానికే సరిపోతోంది. ఉన్న కాస్తంత సమయాన్ని ఆయనే వృథాచేస్తారు’’ అని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. టీఎంసీ నేత సాగరికా ఘోష్, ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా తదితరులు ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. 
 

ఇదీ చదవండి: ధన్‌ఖఢ్‌పై అవిశ్వాసం

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)