Breaking News

కర్నాటకలో ట్విస్ట్‌.. ఎన్నికల బరిలో కేజీఎఫ్‌ బాబు భార్య

Published on Fri, 04/14/2023 - 15:23

బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు సీనియర్లకు, కీలక నేతలకు సీటు ఇవ్వకపోవడంతో వారు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ నిరాకరించిన ఓ కోటీశ్వరుడు ఇప్పుడు తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నాడు.

వివరాల ప్రకారం.. కర్నాటకలోని ధనవంతుల లిస్టులో కేజీఎఫ్‌వాసి యూసుఫ్‌ షరీఫ్‌ కూడా ఒకరు. యూసుఫ్‌ను అలియాస్‌ కేజీఎఫ్‌ బాబుగా పిలుస్తారు. అయితే, కేజీఎఫ్‌ బాబు రెండేండ్ల క్రితం కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను చిక్కపేట నుంచి పోటీచేయాలని భావించి ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో కాంగ్రెస్‌ కేజీఎఫ్‌ బాబుకు అవకాశం ఇవ్వకపోగా, పార్టీ నేతల్లో నెలకొన్న విభేదాల కారణంగా ఏకంగా ఆయనపై సస్పెండ్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో సస్పెండ్‌ను సీరియస్‌గా తీసుకున్న కేజీఎఫ్‌ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పోటీ చేయాలనుకున్న స్థానం నుంచి ఆయన తన భార్య షాజియాను స్వతంత్ర అభ్యర్థిగా  బరిలోకి దించారు. ఇందుకోసం ఆమె గురువారం నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. తన భర్త బాబు, కుమార్తెతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

ఇక, కేజీఎఫ్ బాబు కర్నాటకలో గుజిరీ వ్యాపారాన్ని ప్రారంభించి కోట్ల రూపాయలు సంపాదించారు. కేజీఎఫ్‌ బాబు అంతుకుముందు ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తిని రూ.1,743 కోట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. దీంతో, దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది. ఇక, తాజాగా ఆయన భార్య కూడా ఎన్నికల బరిలో నిలవడంతో మరోసారి ఆయన హాట్‌ టాపిక్‌గా మారారు. 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి