Breaking News

చంద్రబాబు సీట్లు అమ్ముకుంటారు

Published on Fri, 02/02/2024 - 09:41

లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘రానున్న ఎన్ని­కల్లో చంద్రబాబు డబ్బున్నవాళ్లకు సీట్లు అమ్ముకుంటారు. ఎన్నికల తర్వాత ఆ డబ్బుతో మూట, ముల్లె సర్దుకుని రాష్ట్రం నుంచి పారిపోతారు...’ అని విజ­యవాడ లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్‌(నాని) అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజలు కూడా తమకు మంచి చేస్తున్న ఆయన పక్షానే ఉన్నారని చెప్పారు. వైఎస్సార్‌ ఆసరా వారోత్స­వాల్లో భాగంగా గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న కేశినేని నాని మాట్లాడుతూ పేదల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారని, చంద్రబాబు మాత్రం ధనికుల కోసం పని చేస్తారని చెప్పారు. సమాజం బాగుండాలని వైఎస్‌ జగన్‌ కృషి చేస్తుంటే... బాబు మాత్రం తన కొడుకు కోసం తపన­పడుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం జగన్‌లా పనిచేసే వారు ఈ దేశంలోనే ఎవరూ లేరన్నారు.

సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోనే సుమారు రూ.2.50 లక్షల కోట్లు జమచేశారని, ఆ భగవంతుడే సీఎం జగన్‌ రూపంలో పేదలకు మేలు చేస్తు­న్నారని ప్రశంసించారు. పేదల కోసం సీఎం జగన్‌ ఇన్ని చేస్తుంటే రాష్ట్రం దివాలా తీసింది... అంటూ బాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో చిన్నిచిన్న రోడ్ల ఫొటోలు తీసి పచ్చ పత్రికలో పెద్దగా ప్రచురిస్తు­న్నారని, తాను విజయవాడ పార్లమెంటు నియో­జకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ బాగానే ఉన్నాయని నాని స్పష్టంచేశారు.

వైఎస్సార్‌ ఆసరా కింద విజయవాడ నగరంలోని పొదుపు సంఘాల మహిళలకు రూ.350 కోట్లు ఇచ్చారంటే పేదలపట్ల సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో తెలుస్తుందన్నారు. ప్రతి పేద విద్యార్థి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో ఉన్నత విద్య చదవాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారని గుర్తుచుశారు.

వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియో­జకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ మాట్లా­డుతూ నియోజకవర్గంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ‘ప్రతిపక్షాలకు దమ్ముంటే రండి. మేం చేసిన అభివృద్ధి చూపిస్తాం. మేం మంచి చేశాం కాబట్టే దమ్ముగా ప్రజల్లోకి వెళ్తున్నాం.’ అని అన్నారు.

టీడీపీ, జనసేన కుల పార్టీలని, వాటికి ప్రజలకు మేలు చేయాలనే అజెండా లేదన్నారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ చిత్ర­పటానికి పొదుపు సంఘాల మహిళలు, ప్రజా­ప్రతినిధులు, నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్య­క్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, రాష్ట్ర కాపు కార్పొ­రేషన్‌ చైర్మన్‌ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు