Breaking News

బెంగళూరుకు వెళ్లలేదంటే బీజేపీతో ఉన్నట్టు కాదు

Published on Thu, 07/20/2023 - 03:28

సాక్షి, న్యూఢిల్లీ: బెంగళూరులో ఇటీవల జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్‌ఎస్‌ హాజరుకాలే దంటే తాము బీజేపీతో ఉన్నట్టు కాదని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు స్పష్టం చేశారు. 26 పార్టీలు ఒకవైపు, 38 పార్టీలు ఒకవైపు అన్న లెక్కలు రాజకీయాల్లో పనికిరావని, సిద్ధాంతపరంగా ఎవరు ఎటు ఉన్నారు అన్నది చూడాల న్నారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావే శంలో బీఆర్‌ఎస్‌ తరపున ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కేకే మీడియాతో మాట్లాడుతూ  రాజకీయాల్లో అర్థ గణాంకాలు పనిచేయవని, రెండు రెండు నీటి బిందువులు కలిస్తే నాలుగు బిందువులు కావని కేవలం ఒక నీటి బిందువే అవుతుందన్నారు.

కూట ములు విఫల ప్రయోగాలు అని ఇప్పటికే రుజువైందని వ్యాఖ్యానించారు. ఇండియా కూట మిలో ఉంటే బీజేపీకి వ్యతిరేకం అని, లేకపోతే బీజే పీకి మిత్రులని అనుకోవద్దన్నారు. ఐదుగురు జడ్జీల విషయంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కాదంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఆర్డినెన్స్‌ తేవడం అహంకారపూరితమని కేకే మండిపడ్డారు. న్యాయమూ ర్తుల కంటే తమకే ఎక్కువ తెలుసు అన్న ధోరణిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. 

విభజన చట్టంలోని అంశాలపై చర్చ జరగాలి: నామా  
విభజన చట్టంలోని హామీలు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌ అంశాలు, పెండింగ్‌ నిధుల అంశంపై చర్చ జరగాలని ప్రతీ పార్లమెంట్‌ సమావేశ సమయంలో పట్టుబడుతున్నా, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సమావేశాల్లో గవర్నర్‌ వ్యవస్థపై కూడా చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని నామా డిమాండ్‌ చేశారు.  

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?