Breaking News

కేజ్రీవాల్‌ ‘సింపతీ’ రాజకీయం.. సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 03/24/2024 - 09:44

సాక్షి,డిస్పూర్: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేయలేదని, తనంతట తానుగానే అరెస్ట్‌ అయ్యారంటూ అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆరోపించారు. లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఈడీ పంపి తొమ్మిది సమన్లకు ఆయన స్పందిచకపోవడమే కారణమని అన్నారు. కాబట్టే కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు దారి తీసిందని తెలిపారు. ఇదంతా రాజకీయ సానుభూతిని పొందే వ్యూహంలో భాగమేనన్న అనుమానం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో ఎన్నికల సన్నాహక సమావేశం తర్వాత విలేకరులతో అసోం సీఎం మాట్లాడుతూ.. ‘ఈడీ ఎవరికైనా తొమ్మిది సమన్లు ​​అందజేసి, సదరు వ్యక్తి  హాజరుకాకపోతే, అతను తన అరెస్టును ఆహ్వానించినట్లే కదా. ఢిల్లీ సీఎం విషయంలోనూ ఇదే జరిగింది. ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయలేదు. తనని అదుపులోకి తీసుకోమని ఈడీనే ఆహ్వానించారు.

 ఈ సందర్భంగా సమన్లకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వంటి నేతలే ఈడీ ముందు హాజరయ్యారని ఉదహరించారు. ​కానీ కేజ్రీవాల్ తీరు అందుకు భిన్నంగా ఉందని అన్నారు. అంతేకాదు, ఈడీ నుండి వచ్చిన తొమ్మిది సమన్లకు స్పందించకుండా ఉంటే అది అరెస్టుకు ఉద్దేశపూర్వక ఆహ్వానించినట్లే అవుతుందని హిమంత బిస్వా శర్మ  నొక్కిచెప్పారు. ఒకవేళ కేజ్రీవాల్ సమన్లతో ఈడీ ఎదుట హాజరై ఉంటే, అతని అరెస్ట్‌ తప్పించుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

సమన్లపై స్పందించకపోవడానికి  ప్రజల నుండి సానుభూతిని పొందేలా కేజ్రీవాల్‌ వ్యూహమన్న హిమంత బిస్వా.. రాజకీయంగా లబ్ధి చేకూరే ప్రయత్నమేనని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)