Breaking News

తెలంగాణ భవన్‌కు నేడు కేసీఆర్‌

Published on Tue, 02/06/2024 - 00:57

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా బీఆర్‌ఎస్‌ అధి నేత, శాసనసభ పక్షనేత కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం తెలంగాణభవన్‌కు రానున్నా రు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయ కులతో సమావేశమవుతారు. ఈ మేరకు ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు రావాలని అధినేత ఆదేశించారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కృష్ణా బేసిన్‌లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నారు.

అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్‌ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా చర్చించను న్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావే శాల్లో ఎలా ముందుకు వెళ్లాలి? ప్రజాక్షే త్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడంలాంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. రాష్ట్ర  ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కేసీఆర్‌ చర్చించి నేతలకు సూచనలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా తెలంగాణభవన్‌కు కేసీఆర్‌ రానుండటంతో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశముంది.  మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహులు వచ్చి కలవనున్నారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)