Breaking News

కవిత కొడుకు పొలిటికల్‌ ఎంట్రీ!?

Published on Sat, 10/18/2025 - 10:23

సాక్షి, హైదరాబాద్‌: 42 శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్‌తో బీసీ సంఘాలు ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత శనివారం ఉదయం ఖైర‌తాబాద్ చౌర‌స్తాలో మాన‌వహారం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో.. ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య.. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల్సిందేన‌ని ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేస్తూ కనిపించాడు.‘‘కేవ‌లం మా అమ్మ మాత్ర‌మే పోరాటం చేస్తే స‌రిపోదు.. ప్ర‌తి ఇంటి నుండి అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడాలి. బీసీ రిజ‌ర్వేష‌న్లు స్థానిక ఎన్నిక‌ల‌కు ఎంతో అవ‌స‌రం’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

బీఆర్‌ఎస్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కవితను ఆమె తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో నొచ్చుకున్న ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. విదేశాల్లో చ‌దువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు రాగా.. అనూహ్యంగా ఇవాళ్టి బంద్‌, ధర్నాల్లో పాల్గొనడం గమనార్హం.  దీంతో 20 ఏళ్లకే కవిత కొడుకు పొలిటికల్‌ ఎంట్రీకి రెడీనా? అనే చర్చ నెట్టింట జోరుగా నడుస్తోంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)