Breaking News

బాబూ.. కేంద్రం వద్ద తలవంచడానికి కారణమేంటి?: కారుమూరి

Published on Wed, 10/30/2024 - 11:52

సాక్షి, తాడేపల్లి: పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో కేంద్రం నిర్ణయానికి చంద్రబాబు ఎందుకు తలవంచారో తెలియాలన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రాన్ని చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు.  దోచుకో, దాచుకో, పంచుకో అనే కార్యక్రమమే ఇప్పుడు జరుగుతోందని కామెంట్స్‌ చేశారు.

మాజీ మంత్రి కారుమూరి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పోలవరం ఎత్తు తగ్గిస్తే ఏ కాలువలోనూ నీరు పారదు. పోలవరం విషయంలో కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. పోలవరం అంగుళం ఎత్తు తగ్గినా ఊరుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కేంద్రానికి చంద్రబాబు ఎందుకు తలొంచారో తెలియాలి. రాష్ట్రాన్ని చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారు. వైఎస్‌ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండేది. చంద్రబాబు ప్రీమియం చెల్లించకుండా రైతులను నష్టపరిచారు.

ఏపీలో ఈక్రాప్‌తో సహా ఏదీ ఈ ప్రభుత్వం చేయటంలేదు.  దోచుకో, దాచుకో, పంచుకో అనే కార్యక్రమమే ఇప్పుడు జరుగుతోంది. రైతులకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారు. రైతుభరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ధాన్యం కొనుగోలులోనూ రైతులపై రకరకాల వేధింపులకు దిగారు. రైతుల ఉసురు తీయవద్దు. సూపర్ సిక్స్‌లో రైతులకు 20వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. రైతులకు చేయాల్సినవి అన్నీ చేయాలి’ అంటూ డిమాండ్‌ చేశారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)