Breaking News

ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను సస్పెండ్‌ చేసిన జేడీఎస్‌

Published on Tue, 04/30/2024 - 12:54

బెంగళూరు:  కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను జేడీఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌  చేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ ఈ చర్యలు తీసుకుంది. ఇటీవల ఆయనపై లైంగిక ఆరోపణలు రాగా, కన్నడనాట రాజకీయంగా పెను దుమారం రేగింది. మరోవైపు ఈ  వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. మంగళవారం జరిగిన  పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో జేడీఎస్‌.. ఎంపీ ప్రజ్వల్‌పై సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రజ్వల్‌ సస్పెన్షన్‌ ముందు ఆయన బాబాయ్, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి డీకే శివకుమర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అసభ్యకరమైన వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా? అందులో ఉన్నది అతడేననే ఆధారం ఏంటి?. అయినా సరే తాము నైతికత ఆధారంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.  

ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్‌ భారత్‌ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్‌ బృందం విచారణ వేగవంతం చేసింది.

లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయంగా ఈ వ్యవహారం దుమారం రేగటంతో ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం  తీసుకుంటామని సోమవారం జేడీఎస్‌ ప్రకటించిన విషయం  తెలిసిందే.

#

Tags : 1

Videos

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు