Breaking News

Karnataka: డీకే డీకే అంటూ అరిచేది ఎవరు?

Published on Tue, 01/27/2026 - 19:41

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం మార్పు అంశానికి దాదాపు తెరపడినట్లే కనిపించినా, అక్కడక్కడ  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను అభిమానించే గణం మాత్రం తమ వాయిస్‌ వినిపిస్తూనే ఉంది. తాజాగా  ‘డీకే.. డీకే’ అంటూ పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద పెద్దగా అరుపులు అరవడం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విపరీతమైన కోపం తెప్పించింది. అది కూడా తాను పాల్గొన్న ర్యాలీలో ఇలా అరవడం ఏంటనే చిరాకు సిద్ధరామయ్యలో కనిపించింది. ‘ఎవరు డీకే.. డీకే అరుస్తుంది.. నెమ్మదిగా ఉండలేరా.. కామ్‌గా ఉండండి’ అంటూ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు సిద్ధరామయ్యా.

వివరాల్లోకి వెళితే.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం  స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి పథకం "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ ప్రవేశపెట్టడాన్ని  నిరసిస్తూ కర్ణాటక కాంగ్రెస్‌ తీవ్ర  నిరసన వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్‌ పెద్దలు ఓ ర్యాలీ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో సిద్ధరామయ్యతో పాటు శివకుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

అయితే దీనిలో భాగంగా వేదిక వద్దకు సిద్ధరామయ్య నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు డీకే.. డీకే అంటూ పెద్ద పెద్దగా అరవడం ప్రారంభించారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సిద్ధరామయ్య.. ఎవరు.. డీకే డీకే అంటూ అరిచేది.. అరవ కుండా ఉండలేరా. అంతా సైలెంట్‌గా ఉండండి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సిద్ధరామయ్య ప్రసంగించే సమయంలో కూడా డీకే నాదమే వినిపించడంతో సిద్ధరామయ్యకు మరింత కోపం తెప్పించింది. కాకపోతే చేసేది లేక అలాగే ప్రసంగించారు సిద్ధరామయ్య.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)