Breaking News

నేను డీకే పేరు చెప్పాలా?, మీరు నాకు సూచిస్తారా?: సీఎం సిద్ధరామయ్య అసహనం

Published on Sun, 07/20/2025 - 17:33

కర్ణాటక సీఎం మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం సిద్ధరామయ్యను మార్చే అవకాశం ఉందని, ఆ స్థానంలో డీకే శివకుమార్‌కు అవకాశం కల్పించడానికి రంగం సిద్ధమైందంటూ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై సిద్ధరామయ్య కానీ, డీకే శివ కుమార్‌ కానీ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు.

అయితే నిన్న (శనివారం, జూలై 19వ తేదీన) మైసూర్‌ జిల్లాలో జరిగిన పార్టీ ఈవెంట్‌లో ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తిని సీఎం సిద్ధరామయ్య బహిరంగంగానే వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ పేరును పేర్కొనాలనే సూచనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను కీర్తించే క్రమంలో కొత్త ప్రాజెక్టులను ప్రకటించడంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘సాధన సమావేశం’లో సీఎం సిద్ధరామయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కూడా హాజరయ్యారు,. అయితే అత్యవసరంగా  ఆయన బెంగళూరు బయల్దేరాల్సి ఉండటంతో వేదిక పైనుంచి ఉన్నపళంగా వెళ్లిపోయారు. 

అయితే సిద్ధరామయ్య ప్రసంగానికి సిద్ధమైన క్రమంలో పార్టీ ముఖ్యులను పరిచయం చేసే క్రమంలో డీకే పేరు ప్రస్తావించలేదు. అయితే డీకే, డీకే, డీకే అంటూ సభకు వచ్చిన జనం నుంచి స్పందన వచ్చింది. దీనిపై  సిద్ధరామయ్యలో కోపం కట్టలు తెంచుకుంది. 

అదే సమయంలో డీకే పేరును మరిచిపోయారనే ఉద్దేశంతో కాంగ్రెస్‌కు చెందిన ఒక న్యాయవాది.. ఆ విషయాన్ని ఆయనకు తెలియజేసే ప్రయత్నం చేశారు. దీంతో సిద్ధరామయ్యకు కోపం మరింత ఎక్కువవైంది. ‘ డీకే శివకుమార్‌ ఇక్కడ లేరు.. అవునా.. కాదా.. దయచేసి మీరు వెళ్లి కూర్చోండి. మీరు ఏ తరహా న్యాయవాది’ అంటూ కాస్త స్వరం పెంచి మరీ సిద్ధరామయ్య అనడంతో ఇది పార్టీలోని, ప్రభుత్వంలో అంతర్గత లుకలుకల్ని బయటపెట్టింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)