Breaking News

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌ రాజీనామా

Published on Wed, 08/23/2023 - 10:52

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తుండంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు అసమ్మతి సెగలు రాజేస్తున్నారు. అధికార పార్టీని వీడి ఇతర పార్టీలవైపు మొగ్గుచూపుతున్నారు.

ఈ క్రమంలో కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌ గులాబీ పార్టీకి రాజీనామా ప్రకటించారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్‌ వైఖరి వల్లే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు. 

కరీంనగర్ నుంచి బరిలో ఉంటానని మీడియా సమావేశంలో ప్రకటించేందుకు సంతోష్‌ కుమార్‌ సిద్ధమయ్యారు. అయితే ఏదైనా ప్రధాన పార్టీ టికెట్‌ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని లేదా ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగేందుకు సిద్ధమని తెలిపారు.
చదవండి:అవినీతిలో ఆస్కార్‌ ఇవ్వొచ్చు.. కేసీఆర్‌కు ఎదురుదెబ్బ ఖాయం..

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)