Breaking News

Uttar Pradesh: ఒక పార్టీకి మద్దతు పలికిందని దళిత యువతి హత్య

Published on Wed, 11/20/2024 - 13:33

కర్హల్: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా కర్హాల్ అసెంబ్లీ స్థానానికి నేడు (బుధవారం) పోలింగ్ కొనసాగుతుండగా, మరోవైపు దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక దళిత యువతి హత్యకు గురైంది. ఆమెను సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రశాంత్ యాదవ్ హత్య చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి.  

ఆ యువతి బీజేపీకి ఓటు వేయాలని పలువురు ఓటర్లుతో చెప్పిందని అందుకే ఆమెను హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్హల్‌లో దళిత  యువతి హత్యకు కారణకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎస్పీ నేతనే ఈ హత్యకు పాల్పడ్డారని బీజేపీ కర్హల్ అభ్యర్థి అనుజేష్ ప్రతాప్ ఆరోపించారు.

పలు మీడియా కథనాల ప్రకారం బాలిక మృతదేహం నగ్న స్థితిలో లభ్యమయ్యింది. ఇటీవల ఆ యువతికి బెదిరింపులు వచ్చినట్లు  ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారని, ఆ తరువాత యువతి మృతదేహం కర్హల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంజ్రా నది వంతెన సమీపంలో కనిపించిందన్నారు. పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఇటీవల ఒక నేత ఈ ప్రాంతంలో తిరుగుతూ  సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయాలని కోరాడన్నారు. అయితే తమ కుమార్తె మా ఓటు బీజేపీకేనని చెప్పింది.  దీంతో ఆ నేత, అతని సహచరులు తమ కుమార్తెను బెదిరించారని, ఆ తరువాత ఈ దారుణం చోటుచేసుకుందని’ తెలిపాడు.

ఈ రోజు(బుధవారం) కర్హల్ అసెంబ్లీ స్థానంలో ఓటింగ్‌ జరుగుతోంది. ఇదే సమయంలో దళిత యువతి హత్యకు గురికావడం గమనార్హం. ఈ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున తేజ్ ప్రతాప్ యాదవ్, బీజేపీ నుంచి అనుజేష్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్‌ హెచ్చరిక

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)