బీజేపీలోకి కిచ్చా సుదీప్‌! ఎన్నికల్లో పోటీపై నటుడి క్లారిటీ

Published on Wed, 04/05/2023 - 16:27

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపే, జేడీఎస్‌ వంటి పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నడుస్తోంది. వివిధ పార్టీల నుంచి నేతలను ఆకర్షించడంతోపాటు.. సినీ తారలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 

ఈ క్రమంలో కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ బీజేపీలో చేరుతున్నట్లు, కమలం గుర్తు తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. ఇందుకు సుదీప్‌ బుధవారం బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్‌ సీఎం బసవరాజ్‌ బొమ్మై, ఇతర నేతలతో సమావేశమవ్వడమే కారణం. తాజాగా ఈ వార్తలపై సుదీప్‌ స్పందించారు. తాను బీజేపీ తరపున కేవలం ప్రచారంలో మాత్రమే పాల్గొంటానని తెలిపారు.

పార్టీలో చేరడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదీప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మైతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానం, గౌరవంతో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. బొమ్మై వ్యక్తిగతంగా జీవితంలో చాలాసార్లు సాయం చేశారని.. దానికి కృతజ్ఞతగా తాను ఈ విధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇది పార్టీ కోసం కాదని చెప్పారు.

‘జీవితంలో నాకు చాలా మంది నాకు అండగా నిలిచారు. ఎంకరేజ్‌ చేశారు. వారిలో సీఎం బొమ్మై ఒకరు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఆయన కోసమే. పార్టీ కోసం కాదు’ అని తెలిపారు. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఇప్పటికే సీఎంకు చెప్పిన్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చేనెల 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడుతాయి.
చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీపై పిటిషన్ తిరస్కరణ..

Videos

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)