Breaking News

కన్నయ్య కుమార్‌ vs మనోజ్‌ తివారి.. ఎవరి సత్తా ఎంత?

Published on Mon, 04/15/2024 - 08:08

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా బీహార్ రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించిన కన్నయ్య కుమార్ ఇప్పుడు రాజధాని ఢిల్లీలో తన హవా చాటేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై కన్నయ్య కుమార్‌ పోటీకి దిగారు.

ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం యూపీకి ఆనుకుని ఉండటానికి తోడు ఇక్కడ బీహార్, హర్యానాకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. బీజేపీ వరుసగా మూడోసారి మనోజ్ తివారీని ఇక్కడ నుండి పోటీకి నిలబెట్టింది. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు.

మనోజ్ తివారీ భోజ్‌పురి సినిమా నటుడు కావడంతో అతనికి జనాదరణ అధికంగానే ఉంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అతనికి పోటీగా బీహార్‌కు చెందిన కన్నయ్య కుమార్‌కు అవకాశం కల్పించింది. ఈయనకు యువత మద్దతు ఉంది. 2020 ఢిల్లీ అల్లర్లు ఈశాన్య ప్రాంతంలోనే  మొదలయ్యాయి. ఈ ప్రాంతంలోని సీలంపూర్, ముస్తఫాబాద్, బాబర్‌పూర్, కార్గిల్ నగర్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ముస్లిం జనాభా  ఉంటోంది. దీంతో ఇండియా కూటమి అక్కడి ముస్లిం ఓట్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు కన్నయ్య కుమార్‌ ప్రసంగాలు ఉపకరిస్తాయని కాంగ్రెస్‌ భావిస్తోందని సమాచారం. 

జేఎన్‌యూలో కన్నయ్య కుమార్‌ విద్యార్థి నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువతలో అతని పాపులారిటీ తారాస్థాయికి చేరింది. ఇప్పుడు అదే పాపులారిటీని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్‌ చేసింది. మరి ఈశాన్య ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌ కన్నయ్యను ఆదరిస్తారో, బీజేపీ మనోజ్‌ను అక్కున చేర్చుకుంటారో వేచి చూడాల్సిందే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)