Breaking News

ఎవరి జాగీరు కాదు.. ఆంక్షలు పెడితే మళ్లీ వస్తా: కవిత హెచ్చరిక

Published on Mon, 09/22/2025 - 08:11

సాక్షి, సిద్ది­పేట రూరల్‌: ‘ఇది నా జన్మ­భూమి. భవిష్య­త్తు­లో ఇదే నా కర్మ­భూమి కావొ­చ్చు. ఇక్కడి నుంచే కేసీఆర్‌ భూకంపం పుట్టించారు. నామీద రాజకీయంగా ఆంక్షలు పెడితే ఏమీ జరగదు. కుట్ర­లు చేసిన వారిని వదలను’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షు­రాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్‌ స్వగ్రామమైన చింతమడకలో ఆదివారం సాయంత్రం జరి­గిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చింతమడక అంటే చరిత్ర సృష్టించిన గ్రామమని.. ఇక్కడి ముద్దు బిడ్డ కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం సాధించారని అన్నారు. తాను చాలా ఏళ్లు ఇక్కడికి రాలేదని, గత ఏడాది పరిస్థితి వేరేలా ఉండిందని చెప్పారు. కానీ ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని అన్నారు. ఇక్కడికి రావాలన్నా.. ఆంక్షలు ఉన్నాయని, అయితే ఏఊరు ఎవరి జాగీరు కాదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఆంక్షలు పెడితే చింతమడకకు మళ్లీ మళ్లీ వస్తా, అలాగే సిద్దిపేటకూ వస్తానని అన్నారు.

‘చంద్రునికి మచ్చతెచ్చే పని కొంత మంది చేసిండ్రు, అదే విషయం అడిగితే తల్లికి, పిల్లకు పాపిండ్రు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కుట్రలు చేసే వారిని వదలనని, పురిటి గడ్డ పౌరుషం చూపించి.. వారి భరతం పడతానని స్పష్టం చేశారు. అంతకు ముందు గ్రామంలోని శివాలయంలోను, రామాలయంలోను ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)