Breaking News

శాసన మండలిలో కవిత భావోద్వేగం

Published on Mon, 01/05/2026 - 13:35

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో కంటతడి పెట్టారు. ఇదే తన ఆఖరి హాజరు అంటూ ప్రకటించిన ఆమె.. సోమవారం మండలికి హాజరై పలు అంశాలపై భావోద్వేగంగా మాట్లాడారు. 

ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. అంబేద్కర్‌ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతిదాంట్లో అవినీతి జరిగింది. ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించేవారిపట్ల వివక్ష కొనసాగింది.  కేసీఆర్‌పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది.  ఈడీ, సీబీఐలపై పోరాడినా బీఆర్ఎస్‌ నాకు అండగా నిలవలేదు.  

పార్టీ మౌత్‌పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు నాకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదు. నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. కేసీఆర్‌కు అవినీతి మరక అంటితే నేనే పోరాడా. అలాంటిది నా సస్పెన్షన్‌కు ముందు నా వివరణ కోరలేదు. నైతికత లేని బీఆర్ఎస్‌ నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా అంటూ కంటతడి పెట్టారామె. 

ఇకనైనా తన రాజీనామా ఆమోదించండి అని మండలి చైర్మన్‌కు కవిత విజ్ఞప్తి చేశారు. అయితే.. పరిణామాలను తాను అర్థం చేసుకోగలనని, భావోద్వేగాలతో రాజీనామా చేస్తే ఆమోదించరన్న చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. రాజీనామాపై పునరాలోచన చేయాలని కవితకు సూచించారు.

ప్రశ్నిస్తే నాపై కక్షగట్టి పార్టీ నుంచి బహిష్కరించారు: కవిత

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)