రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యమంత్రి

Published on Fri, 02/28/2025 - 04:47

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్‌లోనే సీఎం రేవంత్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేపీతో రేవంత్‌ కలిసి పనిచేస్తున్నారని, ఇటీవల సీఎం, మోదీ నడుమ జరిగిన భేటీతో వారి దోస్తీ బట్టబయలైందన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని, అందులో భాగంగానే లేనిపోని విషయాలను తెచ్చి ఆ రెండు పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీకి అంటగడుతున్నారని ఆమె మండిపడ్డారు.

‘న్యాయవాది సంజీవరెడ్డి మరణం, భూపాలపల్లిలో భూతగాదాలతో వ్యక్తి హత్య, దుబాయిలో ఓ వ్యక్తి మరణం వంటి ఘటనలను బీఆర్‌ఎస్‌కు సీఎం అంటగడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్‌ఎస్‌ పార్టీని టార్గెట్‌ చేయడం మినహా సీఎంకు ఇంకో ఆలోచన లేదు’అని కవిత మండిపడ్డారు. 

ప్రభుత్వ అప్పులపై నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం అబద్దాలు చెబుతున్నారన్నారు. ఎస్‌ఎల్‌బీసీ విపత్తును పక్కన పెట్టి సీఎం ఎన్నికల ప్రచారానికి వెళ్లారని, సీఎంకు  తెలంగాణ ప్రజలు ముఖ్యమా.. కాంట్రాక్టర్లు ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)