Breaking News

బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’గా మారింది: కల్పనా సోరెన్‌

Published on Mon, 10/07/2024 - 21:11

రాంచీ: బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’ మారిందని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ విమర్శలు చేశారు. జార్ఖండ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ పథకాలను బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ చర్యలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని ‍అన్నారు.సోమవారం ‘మైయాన్ సమ్మాన్ యాత్ర'లో భాగంగా గుమ్లా జిల్లాలో జరిగిన ర్యాలీలో కల్పనా సోరెన్ మాట్లాడారు.

‘‘జార్ఖండ్ ముఖ్యమంత్రి మైయాన్ సమ్మాన్ యోజన (జేఎంఎంఎస్‌వై)కి వ్యతిరేకంగా బీజేపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ప్రజలకు మంచి చేసే ఏ పాలసీని ప్రవేశపెట్టినా.. బీజేపీ పిల్‌ వేస్తుంది. జార్ఖండ్ ప్రజల కోసం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచచ్చే పథకాలకు అడ్డంకులు సృష్టించేందుకు ‘పిల్‌ మాస్టర్ గ్యాంగ్‌’గా మారింది’’ అని అ‍న్నారు.

గిరిజన వర్గాల డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ విస్మరిస్తోందని కల్పనా సోరెన్‌ మండిపడ్డారు. ఆదివాసీల గుర్తింపు వారి సంస్కృతి, సర్నా మత నియమావళిలో ఉందని తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలో మేము ఈ కోడ్ కోసం తీర్మానాన్ని ఆమోదించామని అన్నారు. కానీ మన సంస్కృతిని రక్షించడానికి, ప్రత్యేక సర్నా కోడ్‌ను అందించటం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. జార్ఖండ్, గిరిజనుల గుర్తింపు సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే కాపాడగలదని అన్నారామె.

చదవడి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’.. దిగ్విజయ్ చౌతాలా ఆసక్తికర వ్యాఖ్యలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)