Breaking News

‘చంపయీ నీవు పులివి.. ఎన్డీయేలోకి స్వాగతం’

Published on Mon, 08/19/2024 - 10:04

ఢిల్లీ​: జార్ఖండ్‌  ముక్తి మోర్చా నేత చంపయీ సోరెన్ బీబీజేలో చేరుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆదివారం పలువులు ఎమ్మెల్యేలు వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్లిన చంపాయీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీ చేరిపోతారంటూ ప్రచారం జరిగింది. 

ఈ  నేపథ్యంలో తాజాగా చంపయీ సోరెన్‌ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ  కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.  ‘చంపయీ సోరెన్‌ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎ‍ప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి  స్వాగతం’’ అని అన్నారు.

బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంపాయీ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ‘ఎక్స్‌’లో తన ఆవేదనను షేర్‌ చేశారు. ‘జూలై మొదటివారంలో ముఖ్యమంత్రిగా నేను పాల్గొనాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నాకు మాటమాత్రమైనా చెప్పకుండా పార్టీ నాయకత్వం రద్దు చేసింది.  ఎందుకని ఆరా తీయగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉందని, అప్పటిదాకా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?. ఎమ్మెల్యేల సమావేశంలో నన్ను రాజీనామా చేయమన్నారు. నిర్ఘాంతపోయా. అధికారంపై నాకెలాంటి యావ లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేశా. కానీ నా ఆత్మగౌరవం దెబ్బతింది’ అని చెప్పుకొచ్చారు. జీవితాన్ని ధారపోసిన పార్టీలో నా ఉనికే ప్రశ్నార్థకమైంది. 

నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆ రోజే ఎమ్మెల్యేల భేటీలో ప్రకటించా. నా ఈ ప్రయాణంలో అన్ని ప్రత్యామ్నాయాలు తెరిచే ఉంటాయని సోరెన్‌ అన్నారు. ఇది తన వ్యక్తిగత పోరాటమని, ఇతర జేఎంఎం నాయకులను ఇందులోకి లాగదలచుకోలేదని చెప్పారు. ఎంతో చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీకి నష్టం కలిగించాలనే ఆలోచన తానెప్పుడూ చేయలేదని, కాని అలాంటి పరిస్థితులు కల్పించారని చంపయీ అన్నారు.

Videos

YSRCP పేరుతో దొంగ నామినేషన్లు వేసిన 16 మంది TDP నేతలు వీళ్లే..!

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

టీడీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసిరిన మహిళ.. ఇది వింటే..!

టెక్ మహీంద్రా షేర్లలో దూకుడు... 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జనసేన అభ్యర్థిని చితక్కొట్టిన TDP గూండాలు

కుప్పంలో YSRCP పేరుతో TDP దొంగ నామినేషన్లు.. అడ్డంగా దొరికిపోయిన బాబు

మా పై దాడి చేస్తారా.. తేల్చుకుందాం! TDPకి జనసేన నేతలు STRONG వార్నింగ్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్