Breaking News

జార్ఖండ్‌ తదుపరి సీఎం ఆమె? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 01/01/2024 - 18:36

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారని.. తదుపరి సీఎంగా ఆయన భార్య కల్పన బాధ్యతలు తీసుకుంటారని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా నేత  సర్ఫరాజ్ అహ్మద్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నిశికాంత్‌ దుబే వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సర్ఫరాజ్‌ వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాను పార్టీని, సంకీర్ణాన్ని, సీఎం హేమంత్‌ సోరెన్‌ను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.

‘ఎమ్మెల్యేగా సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా కొత్త ఏడాదిలో సోరెన్‌ కుటుంబానికి బాధ కలిగిస్తుంది. త్వరలో హేమంత్‌ సోరెన్‌ కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తారు.ఆయన భార్య కల్పన సీఎం పదవిని చేపడతారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే ‘ఎక్స్‌’ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్‌.. న్యాయ సలహా తీసుకోవాలని బీజేపీ పేర్కొంది. జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం 2019లో కొలుదీరిన విషయం తెలిసిందే.

జేఎంఎం ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు జరిగే ఉప ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని ఎంపీ నిశికాంత్‌ దుబే ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో విచారించడానికి ఇప్పటివరకు ఈడీ.. సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లపై సీఎం హేమంత్‌ సోరెన్ జార్ఖండ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. 2024 పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టి పెట్టుకొని కేంద్రం ప్రతిపక్షాల పైకి దర్యాప్తు సంస్థలను పంపి వాటిని వాడుకుంటోందని మండిపడ్డ విషయం తెలిసిందే.

మరోవైపు అవినీతి కేసులో ఈడీ విచారణపై సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అయితే సీఎం సోమంత్‌ సోరెన్‌ అవినీతి కేసులో అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం పదవిని తన భర్య కల్పనకు అప్పగిస్తారనే చర్చ జోరందుకుంది.

చదవండి:  Lalan Singh: నేను హిందువునే.. వాళ్లలా కాదు..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)