Breaking News

మాజీ సీఎం చంపయీ సోరెన్‌ కొత్త పార్టీ

Published on Wed, 08/21/2024 - 18:48

రాంచి : జార్ఖండ్‌ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీపై ప్రకటన, పార్టీ గుర్తు ఇతర అంశాలపై మరో వారంలో చంపయీ సోరెన్‌ స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.

జార్ఖండ్‌ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి,జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్‌ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరో వారంలో చంపయీ సోరెన్‌ కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు. చంపయీ సోరెన్‌ బీజేపీలో చేరుతున్నానే వార్తల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం నుండి మద్దతుదారులు చంపయీ సోరెన్‌ భారీగా చేరుకుంటున్నారు. ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే అంశంపై చంపయీ సోరెన్‌ మాట్లాడారు. నేను ఇప్పటికే చెప్పా. ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవడం, కొత్త పార్టీని పెట్టడం, లేదంటే మరో పార్టీలో చేరడం. ఇప్పుడు చెబుతున్నా. నేను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు. నేను నా సొంత పార్టీని ఎందుకు పెట్టకూడదు.నా తదుపరి భవిష్యత్‌ కార్యచరణ ఏంటనేది వారంలో తేలిపోతుందన్ని అన్నారు. 

ఆగస్ట్‌ 18న ఢిల్లీలో మకాం
ఆగస్ట్‌ 18న చంపయీ సోరెన్‌ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.దీనికి తోడు చంపయీ సోరెన్‌ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ ‘చంపయీ సోరెన్‌ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎ‍ప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి  స్వాగతం’అంటూ కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.  

ముఖ్యమంత్రి పదవి పోవడంతోనే 
భూ కుంభకోణం కేసులో అప్పటి జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. ఈడీ అరెస్ట్‌తో హేమంత్‌ సోరెన్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపాయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. వరుస పరిణామాల అనంతరం హేమంత్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపయీ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)