Breaking News

జేడీ(యూ) కీలక పదవికి కేసీ త్యాగి రాజీనామా

Published on Sun, 09/01/2024 - 11:02

పట్నా: జనతాదళ్‌(యునైటెడ్‌) సీనియర్‌ నేత కేసీ త్యాగి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ  ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత కారణలతో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ అధ్యక్షుడు, సీఎం నితీశ్‌ కుమార్‌కు రాసిన లేఖలో త్యాగి పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో పార్టీ అధికార ప్రతినిధి హోదాలో కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అందుకే ఆయన తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలో​ చర్చ జరుగుతోంది. మరోవైపు.. కేసీ త్యాగి స్థానంలో కొత్త జాతీయ అధికార ప్రతినిధిగా రాజీవ్‌ రంజన్‌ ప్రసాద్‌ను నియమించినట్లు పార్టీ జనరల్‌ సెక్రటరీ అఫాక్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై ఇటీవల చేసిన  త్యాగి చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు దూరంగా ఉన్నాయని పార్టీ నాయకత్వం భావించినందునే యాన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. గాజాలో శాంతి, కాల్పుల విరమణకు భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. పార్టీ నేతలను సంప్రదించకుండానే త్యాగి చేసిన వ్యాఖ్యల కారణంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో విభేదాలు తలెత్తినట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వంలో  జేడీ(యూ) కీలక భాగస్వామ్య  పార్టీగా కొనసాగుతోంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)