Breaking News

వాళ్లు గొప్ప నటులు!

Published on Sat, 12/21/2024 - 04:32

న్యూఢిల్లీ: పార్లమెంటు ఘర్షణలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీలది నటనేనని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ ఆరోపించారు. వారి నటనా పటిమకు అన్ని అవార్డులూ ఇవ్వొచ్చంటూ ఎద్దేవా చేశారు. రాహుల్‌గాం«దీ, ఇతర కాంగ్రెస్, విపక్షాల ఎంపీల తోపులాటలో గాయపడ్డట్టు బీజేపీ సభ్యులు ప్రతాప్‌చంద్ర సారంగీ, ముకేశ్‌ రాజ్‌పుత్‌ చెప్పడం తెలిసిందే. రాహుల్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఫాంగ్నాన్‌ కొన్యాక్‌ ఆరోపించారు.

శుక్రవారం విపక్షాల ఆందోళన సందర్భంగా జయ మీడియాతో మాట్లాడుతూ వారి తీరును తీవ్రంగా ఆక్షేపించారు. వాళ్లకంటే మెరుగైన నటులను తన కెరీర్లోనే చూడలేదంటూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘‘రాజ్‌పుత్‌కు తొలుత చిన్న బ్యాండేజీ వేశారు. తర్వాత దాని సైజు పెరిగింది. చివరికి చూస్తే ఐసీయూలో తేలారు. ఎంత అద్భుతమైన నటనో!’’ అంటూ దుయ్యబట్టారు. జయ విమర్శలపై బీజేపీ మండిపడింది. ‘‘బాధితులను వదిలి నిందితుని పక్షం వహించడమా? సమాజ్‌వాదీ పార్టీ సంస్కృతికి, విపక్ష ఇండియా కూటమి సంస్కృతికి ఇది మరో నిదర్శనం’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా విమర్శించారు. 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు