Breaking News

జనసేన ఎమ్మెల్యే నాయకర్‌ రౌడీయిజం

Published on Fri, 02/07/2025 - 08:16

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా :  రాష్ట్రంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు పేట్రేగి పోతున్నారు. అధికార మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజానికి దిగారు. భీమవరంలో కోర్టు వివాదంలో ఉన్న ఓ ప్రైవేట్ స్థలంలో దాదా గిరి చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. తన అనుచరులతో యజమానులను బెదిరించారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ రౌడీయిజంతో భయాందోళనకు గురైన బాధితుల్ని పోలీసుల్ని ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.  

జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ అనుచరులే కాదు.. గతంలో ఆ పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. మత్య్సకారుల దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.

అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్‌ అండ్‌ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)