మచిలీపట్నం జనసేన లోక్‌సభ అభ్యర్థి ప్రకటన

Published on Sat, 03/30/2024 - 12:42

కృష్ణా, సాక్షి: పెండింగ్‌ ఎంపీ సీటుకు జనసేన అభ్యర్థిని ప్రకటించింది. ముందు నుంచి ఊహించినట్లే జనసేన తరఫు నుంచి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్‌ కల్యాణ్‌ అధికారికంగా ప్రకటించారు.  ఇప్పటికే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తంగెనళ్ల ఉదయ శ్రీనివాస్‌ పోటీ చేస్తారని పవన్‌ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కూటమి పొత్తులో భాగంగా.. జనసేన 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్‌ సీట్లు తీసుకుంది. ఇప్పటికే ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థుల కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా బాలశౌరిని మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానపు అభ్యర్థిగా ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ తరఫున 2019లో ఎంపీగా నెగ్గిన వల్లభనేని బాలశౌరి.. ఈ ఏడాది జనవరి 14న పార్టీని వీడారు. ఫిబ్రవరి 4వ తేదీన జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది.

ఇదిలా ఉంటే.. పెండింగ్‌లో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు అభ్యర్థుల కోసం పవన్‌ మల్లగుల్లాలు పడుతున్నారు. విశాఖ సౌత్‌ సీటును వంశీ యాదవ్‌కు కేటాయిస్తారని తొలి నుంచి ప్రచారం జరుతోంది. అయితే వంశీకి సీటు ఇవ్వొద్దంటూ అక్కడి జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినా ఆ వలస నేతకే ఇవ్వాలని పవన్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

మరోవైపు పెండింగ్‌లో ఉన్న అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లకు ధనబలం ఉన్న నేతలను ఎంపిక చేయాలని పవన్‌ భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయా స్థానాల్లో ఇప్పటికే పవన్‌ వాయిస్‌తో ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించే చాన్స్‌ ఉంది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)