Breaking News

కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్‌ కీలక వ్యాఖ్యలు

Published on Wed, 07/26/2023 - 12:20

సాక్షి, హైదరాబాద్‌: ​కొత్తగూడెం నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు జరిగిన నాలుగున్నరేండ్ల తర్వాత ఎట్టకేలకు జలగం వెంకట్రావ్​ గెలిచారు. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్​రావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు, జలగం వెంకట్రావ్‌​నే ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావ్‌ బుధవారం ఉదయం అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ఈ సందర్బంగా కోర్టు తీర్పు కాపీని అసెంబ్లీ సెక్రటరీకి జలగం అందించారు. ఈ క్రమంలో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరారు. ఈ సందర్బంగా జలగం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు నన్ను ఎమ్మెల్యేగా గుర్తించింది. ఈ క్రమంలోనే కోర్టు తీర్పు ప్రకారం.. నన్ను ఎమ్మెల్యేగా గుర్తించాలని స్పీకర్‌, అసెంబ్లీ సెక్రటరీని కలిసి కోరాను. 2014లో నేను ఏ ఉద్దేశ్యంతో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరానో అదే విధంగా ఇప్పుడు కూడా పార్టీ కోసం శ్రమిస్తాను అని స్పష్టం చేశారు. 

నా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. నేను పార్టీలోనే ఉన్నాను. కేసీఆర్‌.. నన్ను పిలిచిన ప్రతీసారి నేను కలవడం జరిగిందన్నారు. నేను బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌ మీదనే గెలిచాను అని వెల్లడించారు. ఇదే సమయంలో ఈరోజు సాయంత్రం సీఈవో వికాస్‌ రాజ్‌ను కలవనున్నట్టు వెంకట్రావ్‌ కలవనున్నారు. ఇదిలా ఉండగా.. 2018లో వనమా వెంకటేశ్వర్​రావు ఈసీకి సమర్పించిన ఎలక్షన్ ​అఫిడవిట్​లో తప్పులను దొరకబట్టిన జలగం, నాలుగేండ్లుగా  న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ను వీడుతున్నారంటూ వార్తలు.. స్పందించిన ఎంపీ ఉత్తమ్‌


Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు