Breaking News

కాంగ్రెస్‌పై కోమటిరెడ్డి కామెంట్స్‌.. జగ్గారెడ్డి రియాక్షన్‌ ఇదే..

Published on Tue, 02/14/2023 - 16:40

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్‌ తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ను పెంచాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు, బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు స్పందిస్తూ కౌంటర్‌ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌తో పొత్తకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదు. కాంగ్రెస్‌లో ముఖ్య నాయకుడు.. పార్టీలో కోవర్డులు ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో స్టార్లు, సూపర్‌ స్టార్లు ఇలా మాట్లాడుతుంటే ఎవరికీ ఏమీ చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్‌ గాంధీ చెప్పిందే ఫైనల్‌. బీజేపీకి మాపై ఆరోపణలు చేస్తే అర్హత లేదు. కేంద్రం తెచ్చిన బిల్లులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చింది.  బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేశాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌తోనే కాంగ్రెస్‌ పోరాటం అని స్పష్టం చేశారు.  

మరోవైపు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మల్లు రవి కూడా స్పందించారు. మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్‌ వస్తుందనడం హాస్యాస్పదం. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తాం. గతంలో కోమటిరెడ్డికి షోకాజ్‌నోటీసులు ఇస్తే చెత్తబుట్టలో వేశారు. రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు కాంగ్రెస్‌కు నష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెజార్టీ సాధిస్తుంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌కు నష్టం చేసేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ను గందరగోళంలో పడేశాయి. పార్టీని రక్షించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కూడా తప్పుపట్టారు. అటు టీపీసీసీ రేవంత్‌ రెడ్డి వర్గం కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)