Breaking News

కర్నాటక: రాజ్యసభ సీటు ఆఫర్‌ చేశారు.. షెట్టర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Published on Sun, 04/16/2023 - 19:13

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా సీనియర్‌ నేత, మాజీ సీఎం జగదీష్‌ షెట్టర్‌.. బీజేపీకి గుడ్‌ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి ​కూడా షెట్టర్‌ రాజీనామా చేశారు.

ఈ సందర్బంగా షెట్టర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీష్‌ షెట్టర్‌ మాట్లాడుతూ.. బీజేపీని వీడకుండా ఉండేందుకు తనకు పార్టీ పెద్దలు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేశారని చెప్పుకొచ్చారు. అయితే, రాజ్యసభ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్టు తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను.. సీట్లు అడిగినా ఇవ్వలేదని ఫైరయ్యారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన తనను చివరకు పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసినట్టు వెల్లడించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలో బీజేపీ 20-25 సీట్లు కోల్పోతుందని ఈయన ఇప్పటికే హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ హైకమాండ్‌ పలువురు సీనియర్లకు హ్యాండిచ్చింది. పార్టీ టికెట్లు ల‌భించ‌క‌పోవ‌డంతో ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నేత‌లు బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ల‌క్ష్మ‌ణ్ స‌వ‌ది ఇటీవ‌ల బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.  కాగా.. జగదీష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. 
 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు