Breaking News

మృత ఉద్యోగికి ఎన్నికల డ్యూటీ.. అధికారి సస్పెండ్‌!

Published on Sun, 04/07/2024 - 08:16

లోక్‌సభ ఎన్నికల డ్యూటీ కేటాయింపులో వింతవైనం వెలుగు చూసింది. ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో చోటుచేసుకుంది. ఈ  ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్‌ కమిషనర్‌పై వేటు పడింది. 

వివరాల్లోకి వెళితే జబల్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న రచయితా అవస్థి.. మరణించిన ఒక మహిళా ఉద్యోగిని ఎన్నికల విధులకు కేటాయించారు. అలాగే ఆమె చేయాల్సిన పనులను కూడా సంబంధిత రిపోర్టులో పేర్కొన్నారు. తరువాత  ఎన్నికల ఉద్యోగుల డేటా బేస్‌ను ఎన్నికల కార్యాలయానికి పంపారు. అయితే దీనిలో చనిపోయిన ఒక మహిళా ఉద్యోగి పేరు కూడా ఉందని జిల్లా ఎన్నికల అధికారి గుర్తించారు.  

ఈ నేపధ్యంలో ఎన్నికల అధికారులు సంబంధిత అధికారులను విచారించారు. చివరికి ఇది అసిస్టెంట్‌ కమిషనర్‌ రచయితా అవస్థి తప్పిదమని తేలింది. దీంతో  జిల్లా ఎన్నికల అధికారి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, అసిస్టెంట్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని,  కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి దీపక్ సక్సేనా హెచ్చరించారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి