Breaking News

అసెంబ్లీలో మళ్లీ కూన వర్సెస్‌ అచ్చెన్న!

Published on Wed, 11/20/2024 - 11:15

అమరావతి, సాక్షి:  ఉమ్మడి శ్రీకాకుళం ముఖ్య నేతల విబేధాలు.. అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఈసారి సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయగా, మంత్రి అచ్చెన్నాయుడు కాస్త గట్టిగానే స్పందించారు.

ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ ల కొనుగోలు లో అక్రమాలు జరిగాయంటూ కూన రవికుమార్ ఇవాళ అసెంబ్లీలో ఆరోపణలు గుప్పించారు. ‘‘లక్షా 30 వేలకు పక్క స్టేట్‌లో కొంటే.. మన రాష్ట్రం లో 2 లక్షల 4 వేలకు ఎందుకు కొనుగోలు చేశారు?. గోద్రెజ్ లాంటి కంపెనీలను పక్కన పెట్టి కోల్డ్ చైన్ లాంటి కంపెనీలకు ఎందుకు అనుమతి ఇచ్చారు?’’ అని కూన ప్రశ్నించారు.

దీనికి మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ.. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్  లు హారిజాంటల్, వర్టికల్ అని రెండు మోడల్స్ ఉంటాయ్. హారిజాంటల్ ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం కోరింది. ఫార్చ్యూన్ అనే కంపెనీ L1  కోట్ చేయడం తో వారికి టెండర్ వచ్చింది. మహారాష్ట్ర లో లక్షా 84 వేలు, కర్నాటక లో 2.27 లక్షలకు కొన్నారు.

.. గోద్రెజ్ కంపెనీ వాళ్లకు టెండర్ రాలేదని రాద్ధాంతం చేసారు. విశాఖ లో ఒక గోద్రెజ్ డీలర్ దీన్ని వివాదం చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై మేము గోద్రెజ్ కంపెనీ కి లెటర్ రాసాం, మాకేం సంబంధం లేదని చెప్పారు. అయినా సభ్యులకు అనుమానాలు ఉన్నాయ్ కాబట్టి మరోసారి విచారణ చేయిస్తాం ’’ అని మంత్రి అచ్చెన్న అన్నారు. ఇక..

ఈ సమావేశాల్లో మొన్నీమధ్యే ఇద్దరి మధ్య ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది.  జీరో అవర్‌లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు.. ‘‘‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అని బదులిచ్చారు. అయితే ఇద్దరి మధ్య మాటలయుద్ధ తీవ్రతను తగ్గించేందుకు.. మధ్యలో స్పీకర్‌ అయ్యన్న జోక్యం చేసుకుని ఏదో జోక్‌ వేసే ప్రయత్నం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)