Breaking News

Bihar: కొత్త డిప్యూటీ సీఎం తలపాగ వెనుక ఆసక్తికర కథ

Published on Mon, 01/29/2024 - 21:04

పాట్నా: బిహార్‌ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన సామ్రాట్‌ చౌదరి కాషాయ తలపాగా వెనుక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. గతంలో నితీశ్‌ బీజేపీని వదిలి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పట్లో ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సామ్రాట్‌ ఒక శపథం చేశారు.

నితీశ్‌ కుమార్‌ను గద్దె దించిన తర్వాతే తాను తలపాగా తీస్తానని ప్రతిన పూనారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య నితీశ్‌ తాజాగా బిహార్‌లో మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కొత్తగా ఏర్పాటైన ఎన్‌డీఏ ప్రభుత్వంలో సామ్రాట్‌ చౌదరి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి.

దీంతో  మీడియా ప్రతినిధులు సామ్రాట్‌కు తన తలపాగాపై ప్రశ్నలు సంధించారు. దీనికి స్పందించిన సామ్రాట్‌ బీజేపీ తనకు రెండో తల్లిలాంటిదని, అయోధ్యకు వెళ్లినపుడు రాముడిని దర్శించుకునేందుకు తల వంచేందుకు వీలుగా తలపాగా తీసేస్తానని సామ్రాట్‌ నర్మగర్భంగా సమాధానిమిచ్చారు. సామ్రాట్‌ 2018లో నితీశ్‌కుమార్‌ పార్టీ జేడీయూను వీడి బీజేపీలో చేరడం గమనార్హం. 

ఇదీచదవండి.. మోదీ మళ్లీ పీఎం అయితే.. ఖర్గే కీలక వ్యాఖ్యలు   

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)