Breaking News

బీజేపీకి అభ్యర్థులు కావలెను. ఆసక్తి రేపుతున్న ‘టీఎంసీ’ పోస్టర్లు

Published on Wed, 04/03/2024 - 17:14

కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) మధ్య జరుగుతున్న పోస్టర్‌ వార్‌ ఆసక్తిరేపుతోంది. బీజేపీ ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించని అసన్‌సోల్‌, డైమండ్‌ హార్బర్‌ లోక్‌సభ సీట్ల విషయంలో టీఎంసీ గోడలపై పోస్టర్లు వేసింది. క్యాండిడేట్‌ వాంటెడ్‌ అని షాడో ఫేస్‌ ఉన్న పోస్టర్లను వీధుల్లో  అంటించారు. దమ్ముంటే  బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ నేత సువేందు అధికారి డైమండ్‌ హార్బర్‌ సీటు నుంచి పోటీ చేయాలని టీఎంసీ సవాల్‌ విసురుతోంది.

ఇక్కడి నుంచి ప్రస్తుతం టీఎంసీ జనరల్‌ సెక్రటరీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అసన్‌సోల్‌ నుంచి బీజేపీ క్యాండిడేట్‌గా ప్రకటించిన పవన్‌సింగ్‌ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నారు.

దీంతో బీజేపీ ఇక్కడ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అసన్‌సోల్‌లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే లేరని టీఎంసీ ఎద్దేవా చేస్తోంది. కాగా, పశ్చి‍మ బెంగాల్‌లో ఈ నెల 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 

ఇదీ చదవండి.. బీజేపీకి షాక్‌ శివసేన(ఉద్ధవ్‌)లోకి సిట్టింగ్‌ ఎంపీ 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)