Breaking News

ఇందిరా గాంధీ మ‌మ్మ‌ల్ని జైల్లోకి నెట్టారు.. కానీ: ఎమ‌ర్జెన్సీపై లాలూ యాద‌వ్‌

Published on Sat, 06/29/2024 - 16:18

రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎమ‌ర్జెన్సీపై శనివారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 50 ఏళ్ల క్రితం అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరా గాంధీ విధించిన అత్య‌యిక స్థితి స‌మ‌యంలో తాము ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను లాలూ గుర్తు చేసుకున్నారు. ఇందిరా గాంధీ అనేక‌మంది నాయకులను కటకటాల వెనక్కి నెట్టారు.. కానీ, ఎప్పుడూ ఎవ‌రిని హింసించ‌లేద‌ని పేర్కొన్నారు.

ఈ మేర‌కు లాలూ, జ‌ర్న‌లిస్ట్ న‌లిన్ వ‌ర్మ రాసిన "ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975" ఆర్టిక‌ల్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇందులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. 1975 దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అయినప్పటికీ 2024లోనూ ప్రతిపక్షాలను ప్ర‌భుత్వం గౌరవించడం లేద‌నే విషయాన్ని మరిచిపోకూడదన్నారు.

"అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి నేను కన్వీనర్‌గా ఉన్నాను. నేను 15 నెల‌ల‌కు పైగా భద్రతా చట్టం (మిసా) కింద జైలులో ఉన్నాను.  ఈ రోజు ఎమర్జెన్సీ, స్వేచ్ఛ విలువ ఉపన్యాసాలు ఇస్తున్న మోదీ, జేపీ నడ్డా, ఇత‌ర బీజేపీ మంత్రుల‌ గురించి  నాకు, నా స‌హ‌చ‌రుల‌కు తెలియ‌దు. వారి గురించి మేము అస‌లు విన‌లేదు.

ఇందిరా గాంధీ మనలో చాలా మందిని కటకటాల వెనక్కి నెట్టారు. కానీ ఆమె మమ్మల్ని ఎప్పుడూ దుర్భాషలాడలేదు. ఆమె లేదా మంత్రులు మమ్మల్ని జాతీ వ్యతిరేకులు, దేశభక్తి లేనివార‌ని ఎప్పుడూ పిలవలేదు. మన రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతిని అపవిత్రం చేయడానికి ఆమె ఎప్పుడూ విధ్వంసకారులను అనుమతించలేదు. 1975 మన ప్రజాస్వామ్యానికి మచ్చ. కానీ 2024లోనూ ప్రతిపక్షాలను బీజేపీ గౌరవించడం లేద‌ని విష‌యాన్ని మరచిపోకూడదు. ”అని లాలూ పేర్కొన్నారు.

కాగా జూన్ 25, 1975న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 21 నెలల అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ కాలాన్ని భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే ఎమర్జెన్సీ విధించి జూన్ 26కు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్ర‌మంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 'ఎమర్జెన్సీ' విధించడాన్ని విమర్శించారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేత‌లు ఖండించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)