Breaking News

Opposition Meet: కాంగ్రెస్‌ త్యాగం?

Published on Fri, 01/12/2024 - 21:07

ఢిల్లీ: విపక్ష కూటమి ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) శనివారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11.30 సమయంలో వర్చువల్‌గా 26 పార్టీలు సమావేశం కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలు అనే అంశం  ప్రధానంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కూటమికి కన్వీనర్‌ ఎవరనేది కూడా రేపే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గత రెండు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. ఈసారి మొత్తం 543 లోక్‌సభ సీట్లలో కేవలం 255 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్‌. బీజేపీ ఓటమి లక్ష్యంగా.. కూటమిలోని ఇతర పార్టీల కోసం సీట్లను ‍త్యాగం చేసే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి. అదే జరిగితే స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అత్యల్ప స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. అంతకు ముందు 2004లో కాంగ్రెస్‌ 417 సీట్లకు పోటీ చేసింది.అయితే.. 

ఇండియా కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఆధిపత్య ధోరణి ప్రదర్శించే క్రమంలో.. సీట్ల పంపకాల ప్రక్రియను ముందుకు సాగడం లేదు. పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌లో కాంగ్రెస్‌ వైఫల్యాన్ని సాకుగా చూపించి.. కాంగ్రెస్‌తో సీట్ల షేరింగ్‌కు అక్కడి పార్టీలు అయిష్టత చూపుతున్నాయి. బెంగాల్‌లో దక్షిణ మాల్దా, బహరాంపూర్‌ స్థానాల్ని వదులుకునేందుకు టీఎంసీ సుముఖంగా కనిపించడం లేదు. అదే విధంగా బీహార్‌ నుంచి జేడీయూ-ఆర్జేడీ కూటమి కూడా ఇదే తరహా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఆప్‌ సైతం కాంగ్రెస్‌కు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేదనే సంకేతాలు ఇస్తోంది. దీంతో.. రేపటి సమావేశంపై ఆసక్తి నెలకొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)