Breaking News

‘నేను రాలేదు.. కాబట్టే నువ్వు గెలిచావ్‌ రా’!..

Published on Mon, 11/25/2024 - 14:33

ముంబై : నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పోటీ చేసి ఉండి ఉంటే రిజల్ట్‌ మరోలా ఉండేదంటూ బాబాయ్‌ అజిత్‌ పవార్‌, అబ్బాయి రోహిత్‌ పవార్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుతం, ఆ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తరుఫున అహల్య జిల్లా ఖజరత్‌ జమ్‌ఖేడ్‌ నియోజకవర్గం నుంచి అజిత్‌ పవార్‌ సోదరుడి కుమారుడు రోహిత్‌ పవార్‌.. బీజేపీ అభ్యర్థిపై స్వల్ప తేడాతో విజయం సాధించారు.

ఈ తరుణంలో సోమవారం(నవంబర్‌ 25) మహారాష్ట్ర తొలి సీఎం వైబీ చవాన్‌ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అజిత్‌ పవార్‌, ఆయన సోదరుడి కుమారుడు రోహిత్‌ పవార్‌ ఒకరికొకరు ఎదురుపడ్డారు.  

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచావుగా. రా.. వచ్చి నా ఆశీర్వాదం తీసుకో. ఒకవేళ నేనే ఖజరత్‌ జమ్‌ఖేడ్‌లో ఎన్నికల ప్రచారం చేసి ఉంటే ఏమి జరిగి ఉండేది?’’ అని రోహిత్‌ పవార్‌ను ఉద్దేశిస్తూ అజిత్‌ పవార్‌ చిరునవ్వులు చిందిస్తూ  మాట్లాడారు. ఆ మాటతో రోహిత్‌ పవార్.. అజిత్‌ పవార్ కాళ్లకు నమస్కరించారు.

స్వల్ప తేడాది విజయం
ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ అహల్యానగర్ జిల్లాలోని ఖజరత్‌ జమ్‌ఖేడ్‌ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి బీజేపీ నేత రామ్ షిండేపై 1,243 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 

41 అసెంబ్లీ స్థానాల్లో అజిత్‌ పవార్‌ గెలుపు
గత వారం మహరాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికలలో శరత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)10 స్థానాల్ని కైవసం చేసుకోగా.. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ 41 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)