Breaking News

‘సినిమా లేకుండా ఉండలేను.. కేంద్రమంత్రి పదవి ఎక్కువేం కాదు’

Published on Thu, 08/22/2024 - 11:48

కేంద్ర మంత్రిత్వ పదవి, సినిమాల్లో నటించడంపై నటుడు సురేషి గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మోదీ కేబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సురేషి గోపి.. ఇటు సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ వార్తలపై సురేష్‌ గోపి స్పందించారు. మంత్రి పదవిలో ఉంటూ సినిమాల్లో నటించినందుకు తనను కేంద్ర సహాయ మంత్రిగా తొలగిస్తే.. తనను తాను రక్షించుకున్నట్లేనని  పేర్కొన్నారు. అదే విధంగా తన తదుపరి చిత్రం 'ఒట్టకొంబన్' సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరానని.. ఇంకా దీనిపై ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. అయితే సెప్టెంబ‌ర్ 6న షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

కాగా  సురేషి గోపి ప్రస్తుతం మోదీ 3.0 కేబినెట్‌లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి ఉన్నారు. అటు సినిమాల్లోనూ నటన కొనసాగించాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రస్తుతం తన వద్ద అనేక స్క్రిప్ట్‌లు ఉన్నాయని, వీటిలో 20 నుంచి 22 సినిమాలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. సినిమాల్లో నటించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అనుమతి కోరగా.. ఆయన ఎన్ని సినిమాల్లో నటించాలని అడిగారని చెప్పారు.

@నేను 22 సినిమాల్లో నటించాల్సి ఉందని అమిత్‌ షాకు చెప్పాను. అయితే దీనిని ఆయన పక్కన పెట్టారు. ప్రస్తుతం సినిమాల్లోకి నటించేందుకు అనుమతి ఇస్తానని చెప్పారు. ఇప్పుడైతే సెప్టెంబర్‌ 6 నుంచి షూటింగ్‌లో పాల్గొంటాను’ అని కేరళలో ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

‘మంత్రి పదవిని నిర్వహించేందుకు సహకరించడానికి మంత్రివర్గానికి చెందిన ముగ్గురు, నలుగురు అధికారులను నా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.  ఇందుకు సినిమా సెట్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇదంతా వీలు కాకపోతే..  వారు నన్ను కేంద్ర పదవి నుంచి తీసివేస్తే, అది నాకు మేలు చేసిన వాడిగా భావిస్తాను.  

నేను మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ ఆ కోరిక లేదు. నా కోసం కాకుండా నన్ను ఎన్నుకున్న త్రిసూర్ ప్రజల కోసం నాకు మంత్రి పదవి ఇస్తున్నామంటూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి నేను తలవంచి అంగీకరించాను. ఇప్పటికీ నేను మా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను.  కానీ నా అభిరుచి (సినిమా) లేకుండా ఉండలేను’ అని పేర్కొన్నారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)