Breaking News

Delhi Election 2025: 12 ఏళ్ల ‘ఆప్‌’ ప్రస్థానం

Published on Sat, 02/08/2025 - 09:52

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గత మూడు ఎన్నికల్లో  అమోఘ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2012లో ఏర్పడిన ఈ పార్టీ ఇంత త్వరగా జాతీయ పార్టీగా ఎలా  అవతరించింది? అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది. ఆప్‌ ఎదుగుదల వెనుక ఆసక్తికర కథనాలు ఉన్నాయి.

దేశంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాటి సర్కారు అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి అన్నా హజారే నాయకత్వం వహించారు. ఈ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకపాత్ర పోషించారు. లోక్‌పాల్ బిల్లుకు సంబంధించి ఢిల్లీ నుండి ప్రారంభమైన ఉద్యమం దేశంలోని ప్రతి మూలకు వ్యాపించింది. ఉద్యమం ముగిసిన  తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు.

2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీకి కన్వీనర్ అయ్యారు. రాజకీయ నేతలు కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్  తదితరులు పార్టీని ఏర్పాటు చేయడంలో భాగస్వాములయ్యారు. తరువాత వారందరూ వేర్వేరు కారణాలతో పార్టీని వీడారు.

2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి అందించిన మద్దతుతో ఢిల్లీలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ తొలి ఎన్నికల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఆ తర్వాత 2015లో తిరిగి ఎన్నికలు జరిగాయి. నాడు ఆమ్‌ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లలో 67 స్థానాలను గెలుచుకుంది.

కాంగ్రెస్  ఖాతాను కూడా తెరవలేకపోయింది. బీజేపీ కేవలం మూడు సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే కనిపించింది. ఢిల్లీ ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేశారు. దీని తరువాత పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. అనంతరం పంజాబ్ ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)