కంగనా ఇక మండీ క్వీన్‌?

Published on Sun, 06/02/2024 - 08:00

హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీవైపే మొగ్గుచూపాయి. రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యతను ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌ మధ్య  భారీ పోటీ ఏర్పడింది.  

అయితే ఫలితాల్లో కంగనా రనౌత్ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి నుంచి పది మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ మండీ కిరీటం కంగనాకే దక్కుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనావేశాయి. కాంగ్రా లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి రాజీవ్, కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రాలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈ స్థానం నుంచి పది మంది అభ్యర్థులు పోటీకి దిగారు.

హమీర్‌పూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నుంచి సత్పాల్ సింగ్ రైజాదా మధ్య పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం అనురాగ్ ఠాకూర్ హమీర్‌పూర్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఈ స్థానంలో మొత్తం 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సిమ్లా లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి సురేశ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నుంచి వినోద్‌ సుల్తాన్‌పురి తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం సాధించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. బీజేపీ ఈ నాలుగు స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశాలున్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)