Breaking News

ప్రత్యర్థుల్ని మట్టికరిపించిన సోరెన్‌ దంపతులు

Published on Sat, 11/23/2024 - 17:56

న్యూఢిల్లీ: ‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లుగా మారుతాయి’ అనే సామెత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విష‌యంలో అక్షర సత్యమైంది. ఏడాది క్రితం మ‌నీ లాండ‌రింగ్ కేసులో హేమంత్ సోరెన్ జైలు పాలయ్యారు. ఇప్పుడే అదే హేమంత్ సోరెన్ మ‌రోసారి సీఎం కుర్చీని అధిష్టించనున్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో హేమంత్ సోరెన్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంటుంది. దీంతో హేమంత్ సోరెన్ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.

అయితే ఈ సంద‌ర్భంగా తన రాజకీయ జీవితంలో హేమం‍త్ సోరెన్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల్ని ఆయన పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం జైలు పాలైన సోరెన్.. ఎన్నికల్లో సత్తా చాటి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది క్రితం జైలు పాలైన సోరెన్
ఈ ఏడాది జ‌న‌వ‌రిలో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఆయన స్థానంలో తొలుత  సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలొచ్చాయి. దీనిపై సోరెన్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. సోరెన్ సతీమణి కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ సోరెన్ తోటికోడలు సీతా సోరెన్‌తో పాటు ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు విభేధించారు. బీజేపీలో చేరారు. దీంతో  ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్‌ నేత, రవాణాశాఖ మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీక‌రించారు. ఆ తర్వాత తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ప్రతిపక్షాలతో కలిసి  హేమంత్ సోరెన్ కల్పనా సోరెన్ కేంద్రంపై తిరుగుబాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపట్టారు.  

హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన  ఐదు నెలల తర్వాత ఈ ఏడాది జూన్‌లో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రాథమికంగా విచార‌ణ‌లో నిర్ధోషిగా ప‌రిగ‌ణించింది. ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని కోర్టు పేర్కొంది. దీంతో దాదాపు 5 నెలల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు.  తనను తప్పుడుగా ఇరికించారని.. రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తల గొంతు నొక్కుతున్నారని.. జైలు నుంచి విడుదలైన అనంతరం హేమంత్‌ ఆరోపించారు.

హేమంత్ సోరెన్ రాక‌తో చంపై సోరెన్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ మ‌రో మారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీన్ని జీర్ణించుకోలేని చంపై సోరెన్ జేఎంఎంకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.  హేమంత్‌ సోరెన్‌ కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. కల్పనా సోరెన్‌ ఒక్కరే 200పై చీలూకు ఎన్నికల ప్రచారాలతో హోరెత్తించారు.

ఇలా ఎన్ని విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్ప‌టికి హేమంత్ సోరెన్, ఆయ‌న భార్య క‌ల్ప‌నా సోరెన్ పార్టీని ముందుండి న‌డిపించారు. తాజా, ఎన్నిక‌ల్లో అద్భ‌త ఫ‌లితాల్ని రాబ‌ట్టారు. దీంతో రెండో ద‌ఫా సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. 

జార్ఖండ్ మ్యాజిక్ చేసిన JMM

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)