Breaking News

జార్ఖండ్‌ ముఖ‍్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

Published on Sun, 11/24/2024 - 15:55

రాంచీ : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తిరుగులేని విజయం సాధించింది. ఈ తరుణంలో సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అరెస్ట్‌లు,కేసులు, కోర్టులు, తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు, ఇక చొరబాటుదారులదే రాజ్యం అవుతుందని స్వయాన ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు.. వీటన్నిటినీ ఎదుర్కొని హేమంత్‌ సోరెన్‌,కల్పనా సోరెన్‌ దంపతులు విజయం సాధించారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా  88 స్థానాలకు గాను 56 స్తానాల్ని కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ హేమంత్‌ సోరెన్‌ ఆదివారం (నవంబర్‌24) జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్‌తో భేటీ కానున్నారు.  

మనీ లాండరింగ్‌ కేసులో ఐదు నెలల జైలు జీవితం గడిపారు. అనంతరం.. బెయిల్‌ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. బర్హైత్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హేమంత్‌ సోరెన్‌ తన ప్రత్యర్థి, బీజేపీ నేత  గామ్లియెల్ హెంబ్రోమ్‌ను 39,791 ఓట్ల తేడాతో ఓడించారు.

ఇక భర్త జైలు జీవితంతో హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్తపై కేంద్రం చేస్తున్న కుట్రను వివరిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. 200కు పైగా సభలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.  గాండే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,142 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)