పొలిటికల్‌ భేటీలు.. బిగ్‌ షాకిచ్చిన కుమారస్వామి

Published on Mon, 07/17/2023 - 13:46

సాక్షి, బెంగళూరు: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ అలర్ట్‌ అయ్యింది. ఈనేపథ్యంలో రేపు(మంగళవారం) ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. దీంతో, దేశంలో పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. ఇక, విపక్షాల సమావేశానికి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీయే కూటమి సమావేశానికి సుమారు 30 పార్టీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. కాగా, కాసేపట్లో ప్రతిపక్ష నేతల సమావేశం ప్రారంభం కానుంది. 

ఇదిలా ఉండగా.. పొలిటికల్‌ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్‌ అధినేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేదు. ఈ నేపథ్యంలో విపక్షాల మహాకూటమిలో తాము చేరే ప్రసక్తి లేదన్నారు. ఇక, ఇదే సమయంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. ఆ ఫ్రంట్‌నూ చూద్దామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

మరోవైపు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్‌ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్‌కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్‌ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: వీడియో: వందే భారత్‌ రైలులో మంటలు.. భయంతో పరుగు తీసిన ప్రయాణీకులు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)