Breaking News

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు: పోలింగ్ తేదీ మార్పు.. కారణం ఇదే

Published on Sat, 08/31/2024 - 19:27

ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీని అక్టోబర్‌ 5కు మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్‌ 1న పోలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా.. అక్టోబర్‌ 5కు మార్పు చేసింది. తొలుత అక్టోబర్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించగా.. జమ్మూకశ్మీర్‌తో పాటే అక్టోబర్‌ 8న ఫలితాలు వెల్లడించననుంది.

బిష్ణోయ్‌ కమ్యూనిటీ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. శతాబ్దాల నాటి అసోజ్ అమావాస్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు హర్యానాలోని బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు రాజస్థాన్‌కు భారీగా తరలివస్తారు. దీంతో ఎన్నికల సంఘానికి జాతీయ, స్థానిక పార్టీలు.. అఖిల భారత బిష్ణోయ్ మహాసభల నుంచి వినతులు వచ్చాయి. దీంతో ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్‌ తేదీలను మార్చినట్లు ఈసీ ప్రకటించింది.

హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా,  2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ సాధించింది. దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో అధికార బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టడానికి ప్రయత్నిస్తోంది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)